చెలరేగిన అంబటి రాయుడు ; ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఛాంపియన్ ఇండియా మాస్టర్స్
‘ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి సీజన్ ఫైనల్ లో ఇండియా మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ జట్టు 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది
ఓపెనర్ గా వచ్చిన లారా 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన పెర్కిన్స్ కూడా 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన లెండిల్ సిమ్మన్స్ , మరో ఓపెనర్ డేవాన్ స్మిత్ వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ ఇన్నింగ్స్ ను నిర్మించారు
డేవాన్ స్మిత్ 35 బంతుల్లో 45 పరుగులు, లెండిల్ సిమ్మన్స్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
వీరిద్దరూ అవుట్ అయ్యిన తరవాత వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ ఇన్నింగ్స్ తడబాటుకు గురయ్యింది
ఇండియా మాస్టర్స్ బౌలర్ల లో వినయ్ కుమార్ 3 వికెట్ లు తీయగా, నదీమ్ రెండు వికెట్లు తీశాడు. నేగి, బిన్నీ లు చెరో ఒక వికెట్ తీశారు
అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మాస్టర్స్ కు ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు లు చక్కని శుభారంభాన్నిచ్చారు
వీరిద్దరూ మొదటి వికెట్ కు 67 పరుగులు జోడించారు. సచిన్ అవుట్ అయ్యాక, ఒక వైపు వికెట్లు పడుతున్న అంబటి రాయుడు వీరోచితంగా ఆడుతూ జట్టు స్కోర్ 127 పరుగులు ఉన్నప్పుడు, 50 బంతుల్లో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే ఇండియా మాస్టర్స్ విజయం ఖాయమైంది
యువరాజ్ సింగ్ 13 పరుగులతో, బిన్నీ 16 పరుగులు చేసి అజేయంగా లాంఛనాన్ని పూర్తి చేశారు
వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ బౌలర్ల లో నర్స్ రెండు వికెట్లు తీయగా, బెన్, బెస్ట్ చెరో ఒక వికెట్ తీశారు

