ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 లో భాగంగా ఇండియన్ మాస్టర్స్, ఇంగ్లాండ్ మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 25 పరుగులు చేసిన మాడి ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టులో టాప్ స్కోరర్
ఇండియన్ మాస్టర్స్ బౌలర్ల లో ధవళ్ కులకర్ణి 3 వికెట్లు తీయగా, మిదున్, నేగి చెరో రెండు వికెట్లు తీశారు. వినయ్ కుమార్ ఒక వికెట్ తీశాడు
అనంతరం 133 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మాస్టర్స్ కు మొదటి వికెట్ కు 75 పరుగుల శుభారంభం లభించింది. కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 21 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో ఒక సిక్సర్, 5 ఫోర్లు ఉన్నాయి
గురుకీరత్ సింగ్ 35 బంతుల్లో 63 పరుగులు, యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

