ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధమా.. ‘కన్నప్ప’ టీజ‌ర్ రిలీజ్ డేట్ ​ ఫిక్స్​

by | Feb 26, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa) . ఈ సినిమాను ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే, 

అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్​కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రచార చిత్రాన్ని మార్చి 1న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్.

ఇక టీజర్ అనౌన్స్​మెంట్​తో సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పలు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో

ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal), బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) , కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుతో పాటుగా శరత్‌కుమార్‌, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, కాజల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప మూవీ ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.