ఇంగ్లాండ్ పై ఆఫ్ఘానిస్తాన్ 325 పరుగుల భారీ స్కోర్

by | Feb 26, 2025 | Uncategorized

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఇంగ్లాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్తాన్ బలహీనమైన ఇంగ్లాండ్ బౌలింగ్ పై 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన  ఆఫ్ఘానిస్తాన్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్ఠాలలో పడింది.   గుర్బాజ్ 6 పరుగులు, అటల్ 4 పరుగులు, రెహ్మాత్ షా 4 పరుగులు  చేసి అవుట్ అయ్యారు

అయితే ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ షాహిదీ నాలుగవ వికెట్ కు 103 పరుగులు జోడించారు.

40 పరుగులు చేసిన షాహిదీ అవుట్ అయ్యాక, ఓమర్జాయ్ తో కలిసి ఇబ్రహీం జద్రాన్ ఐదవ వికెట్ కు 72 పరుగులు జోడించారు.  41 పరుగులు చేసి ఓమర్జాయ్ అవుట్ అయ్యారు.

ఆ తరవాత వచ్చిన నబి తో ఇబ్రహీం జద్రాన్ ఆరవ వికెట్ కు 111 పరుగులు జోడించిన తరవాత ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  జద్రాన్ 177 పరుగుల ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి.  నబి 24 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు తీసుకోగా, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఓవర్టన్,రషీద్ చెరో ఒక వికెట్ తీశారు 

నిన్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం వలన ఇవాళ్టి మ్యాచ్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ పై 325 పరుగుల భారీ స్కోర్ చేసింది.  ఇంగ్లాండ్ ఛేదన ఆసక్తికరం మారింది ఇప్పుడు