సినీ చరిత్రలోనే తొలిసారి… ‘లక్కీ భాస్కర్‌’  సెన్సేషనల్ రికార్డ్

by | Feb 26, 2025 | టీవీ & ఓటిటి

మహానటి, సీతారామం ఫేమ్ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం లక్కీ భాస్కర్‌.

టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్ ఫర్ సినిమాస్ నిర్మించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న విడుదలైంది. దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే దుల్కర్​ సల్మాన్ కెరీర్‌లో రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా ‘లక్కీ భాస్కర్‌’ కావడం విశేషం. 80వ దశకం నేపథ్యంలో సాగే ఈ చిత్రం మధ్యతరగతి బ్యాంకర్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్​ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 28 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీ పాన్ ఇండియా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ‘లక్కీ భాస్కర్‌’ సినిమా తాజాగా ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. నవంబర్ 28న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ గత 13 వారాలుగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఈ రికార్డు సాధించిన తొలి సౌత్ ఇండియన్ మూవీగా ‘లక్కీ భాస్కర్‌’ అరుదైన ఘనత సాధించింది. సౌత్ ఇండియాలోని టాప్ హీరోల సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ‘లక్కీ భాస్కర్‌’  మూవీ మాత్రమే ఈ ఘనత సాధించడం విశేషం. దీని గురించి చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించింది. ‘లక్కీ భాస్కర్‌’  చిత్రాన్ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.