ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్ లలో ఫైనల్ కు చేరిన భారత జట్టు కెప్టెన్ లు, కప్ గెలిచిన కెప్టెన్ లు ఎవరో చూద్దాం
మొదటగా 1983 కపిల్ దేవ్ సారధ్యంలో భారత జట్టు మొట్ట మొదటి ప్రపంచ కప్ ని గెలుచుకుంది
2002 లో ఛాంపియన్స్ ట్రోఫీ ని శ్రీ లంకతో కలిసి పంచుకుంది ఇండియా. అప్పటి భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ
ఎక్కువ ఐసీసీ ట్రోఫీలను గెలిచిన కెప్టెన్ ఏం ఎస్ ధోని. ఏం ఎస్ ధోని నాయకత్వంలో 2007 ఐసీసీ టి 20 వరల్డ్ కప్, 2011 లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లను గెలుచుకుంది. క్రికెట్ చరిత్రలోనే, మూడు రకాల ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ ఏం ఎస్ ధోని
రోహిత్ శర్మ నాయకత్వం లో 2024 ఐసీసీ టి 20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకుంది
అయితే ఐసీసీ ట్రోఫీ లలో భారత జట్టు ఫైనల్ చేరిన సందర్భాలలో భారత జట్టు కెప్టెన్ లు ఎవరో చూద్దాం
కపిల్ దేవ్ (Kapil Dev), 1983 లో వచ్చిన మొదటి సారి కప్ కొట్టేశారు
సౌరవ్ గంగూలీ (Ganguly) నాయకత్వంలో 2000, 2002 సంవత్సరాలలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లు చేరారు. అయితే 2002 లో శ్రీ లంకతో కలిసి ట్రోఫీ ని పంచుకున్నారు. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో 2003 లో ప్రపంచ కప్ ఫైనల్ కు చేరారు
ధోని (Dhoni) నాయకత్వంలో నాలుగు సార్లు ఐసీసీ ట్రోఫీ ఫైనల్ కు చేరితే మూడు సార్లు కప్ గెలిచారు. ఫైనల్ కు చేరిన మొదటి మూడు సార్లు కప్ గెలిచారు. నాలుగో సారి , 2014 టి 20 వరల్డ్ కప్ ఫైనల్ లో మాత్రం శ్రీ లంక చేతిలో ఓడి పోయారు
విరాట్ కోహ్లీ (Virat Kohli) నాయకత్వంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడిపోయారు.
అంతటి గొప్ప ఆటగాడు, బ్యాట్స్ మన్ అయిన విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు
రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో నాలుగు సార్లు ఐసీసీ ట్రోఫీ లో ఫైనల్ కు వచ్చింది. ధోని తరవాత, భారత జట్టును, ఐసీసీ ట్రోఫీ ఫైనల్ కు నాలుగు సార్లు తీసుకు వచ్చిన ఘనత రోహిత్ శర్మదే. అయితే, 2024 టి 20 వరల్డ్ కప్ మాత్రమే రోహిత్ శర్మ నాయకత్వంలో గెలిచింది


