మళ్ళీ ఢీ కొట్టడానికి వస్తోన్న మంచు విష్ణు, జెనీలియా

by | Mar 8, 2025 | సినిమా

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, జెనీలియా(Jenelia)  హీరోయిన్ గా, శ్రీ హరి ఒక ముఖ్య పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ ఢీ

మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, బ్రహ్మానందం సన్నివేశాలు గిలిగింతలు పెట్టిస్తాయి.  బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకి హైలైట్.  కోన వెంకట్ డైలాగ్స్ కు శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఈ సినిమాను అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ చేసింది.  ఈ రోజు కి ఢీ స్క్రీన్ ప్లే అద్భుతమనే చెప్పాలి.

మంచు విష్ణు, జెనీలియా ల ప్రేమ శ్రీహరి కి తెలిస్తే ఏం జరుగుతుందో అన్న ఊహకు ప్రేక్షకులను వదిలేసిన శ్రీను వైట్ల, చివరకు వీళ్లిద్దరి మధ్య ప్రేమ శ్రీ హరి కి తెలియకుండా, వీళ్లిద్దరికీ శ్రీ హరి  పెళ్లి చేయడం తో ముగుస్తుంది.  ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక అద్భుతం. ఈ తరహా స్క్రీన్ ప్లే తో మళ్ళీ రాలేదు

కోన వెంకట్, గోపి మోహన్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వన్ అఫ్ ది బెస్ట్ ఎంటర్ టైనర్.  కొన్ని కాంబినేషన్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అలంటి కాంబినేషన్ ఈ ముగ్గురిదీ

2007 ఏప్రిల్ లో వచ్చిన ఈ సినిమా కు నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు

బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల కు నంది అవార్డు కూడా వచ్చింది. 

ఇప్పుడు ఈ సినిమాను మార్చ్ 28 న మళ్ళీ  విడుదల చేస్తున్నారు.  ఈ విషయాన్నీ మంచు విష్ణు ఎక్స్ లో పోస్ట్ చేశారు.   ఇదే మార్చ్ 28 న మాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ చిత్రాలు విడుదలవుతున్నాయి

ఏప్రిల్ 25 న కన్నప్ప (Kannappa) విడుదల అవడానికి ఒక నెల ముందు ఈ సూపర్ హిట్ ఎంటర్ టైనర్ ఢీ (Dhee) ని విడుదల చేస్తున్నారు