టాలీవుడ్ యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో #NKR21 వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అయితే మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలానే విజయశాంతి, కళ్యాణ్ రామ్ (Kalyan Ram) పవర్ ఫుల్ గా నడిచి వస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ నూ రిలీజ్ చేశారు.
అయితే, గతంలో విజయశాంతి (Vijaya Shanti) పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా విజయశాంతి పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అబిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

