థ్రిల్లింగ్‌ ఎలిమేంట్స్‌తో ‘హిట్‌ 3’ ట్రైలర్‌.. మే 1న రక్తపాతమే!

by | Apr 14, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు.

వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

వైజాగ్ లోని సంగం థియేటర్లో జరిగిన ఈ ఈవెంట్‌లో హీరో నానితో పాటుగా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
వరుస హత్యల కేసును పోలీస్ ఆఫీసర్ అర్జున్‌ సర్కార్ ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. అర్జున్‌ సర్కార్‌గా నాని చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. మలయాళంలో గతేడాది వచ్చిన ‘మార్కో’ సినిమాకు మించిన రక్తపాతం హిట్‌-3లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ హిట్ 3 సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ లభించినట్టుగా తెలుస్తోంది. దింతో భయంకరమైన హింసను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక ఈ సినిమా రన్‍టైమ్ విషయానికొస్తే.. 2 గంటల 35 నిమిషాల సాలిడ్ రన్‍టైమ్ లాక్ చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

.