టెలివిజన్ లో, తక్కువ రేటింగ్ తో చతికిలపడిన  పుష్పరాజ్ 

by | Apr 25, 2025 | టీవీ & ఓటిటి

అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప 2 ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు.  ముఖ్యంగా, హిందీ మార్కెట్ లో ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టింది.  తెలుగు మార్కెట్ లో అంతగా ప్రభావం చూపకపోయినా, హిందీలో మార్కెట్ లో సుమారు 800 కోట్ల తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ కు లాభాల పంట పండింది 

అయితే ఈ సినిమాను, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా వారు ఏప్రిల్ 13 న ప్రసారం చేశారు.  ఈ సినిమాకు 12.6  రేటింగ్ మాత్రమే వచ్చింది. పుష్ప- పార్ట్ 1 కన్నా చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. పుష్ప-1 కి 20 రేటింగ్ పాయింట్లు వచ్చాయి.

ఇంత తక్కువ రేటింగ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.  అవేంటో చూద్దాం

మొదటగా ఈ సినిమా కంటెంట్, సగటు అల్లు అర్జున్ అభిమానికి కూడా అంత పెద్దగా నచ్చలేదు.

మా టీవీ వారు పుష్ప 2 ప్రసారం చేసినప్పుడు కౌంటర్ గా జీ తెలుగు వారు రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ని ప్రసారం చేశారు.  టీవీ చూసే ఫామిలీ ఆడియన్స్ పుష్ప-2 సినిమా కన్నా, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఇష్టపడతారు.  పుష్ప-2 మొదటి సారి 12.6 రేటింగ్ వస్తే, సంక్రాంతికి వస్తున్నాం రెండవ సారి, పుష్ప-2 కి కౌంటర్ గా వేసినప్పుడు 6 కి పైగా రేటింగ్ వచ్చింది

పుష్ప-2 సినిమాని బాలీవుడ్ ఆడియన్స్ ఆదరించినంతగా తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు.

పుష్ప-2 సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలు – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ ఒక రాత్రి జైలు లో ఉండడం, తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు ఇప్పటికి ఆస్పత్రిలో ఉండడం, అల్లు అర్జున్ పొంతనలేని పొగరు మాటలు వంటి అంశాలు అల్లు అర్జున్ వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేసాయి అనడంలో సందేహం లేదు