హిట్ 3 -ఆబ్కి బార్ అర్జున్ సర్కార్ ..సూపర్ థీమ్ సాంగ్ విడుదల

by | Apr 9, 2025 | సినిమా

హిట్ ఫ్రాంచైజ్ లో వస్తోన్న మూడవ సినిమా హిట్ 3.  ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నాడు.  ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి నానికి జంటగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో హీరో కార్తీ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. మే 1 న ఈ ‘హిట్ 3’ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో క్యారక్టర్ ని తెలియచేసే థీమ్ సాంగ్ ని విడుదల చేశారు.  ఈ సినిమాకు మికీ జె మేయర్ స్వరాలూ సమకూర్చారు

ఆబ్కి బార్ అర్జున్ సర్కార్ అంటూ సాగే ఈ పాటను గాయకుడూ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు.