టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18 న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం విడుదలవుతోంది.
ఇప్పుడు ఈ చిత్రం నుండి ముచ్చటగా బంధాలే అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. రఘురాం రాసిన ఈ పాటను హరి చరణ్ ఆలపించారు. అజనీష్ లోకానాధ్ స్వరాలూ సమకూర్చారు
ఇందులో సయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.

