ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు కానుకగా అల్లు అర్జున్-అట్లీ సినిమాపై అధికారికంగా ప్రకటన విడుదల చేశారు మేకర్స్. ‘A22 x A6’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తోంది. కోలీవుడ్ దిగ్గజ సినీ నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ కళానిధి మారన్ సమర్పణలో భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్‌పై చిత్రీకరించిన ఓ వీడియోను ఈ మూవీ అనౌన్స్మెంట్ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోకు ఆరు మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ (Sun Pictures) రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ (Allu Arjun) , అట్లీ సినిమా పోస్టర్ హాలీవుడ్ సినిమా పోస్టర్ కు కాపీలా ఉందని, దర్శకుడు అట్లీ కాపీ చేశారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2021లో వచ్చిన హాలీవుడ్ ‘చిత్రం ‘డూన్’ మూవీ పోస్టర్ ను కాపీ చేసి అల్లు అర్జున్- అట్లీ సినిమా పోస్టర్ ను రూపొందించారని అంటున్నారు. 2021లో వచ్చిన ‘డ్యూన్’ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా పోస్టర్ ను యథాతథంగా ఈ సినిమా కోసం ఉపయోగించడాన్ని పలువురు తప్పు పడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రానికి లాస్ఏంజెల్స్కు చెందిన వీఎఫ్ఎక్స్ సంస్థ పనిచేస్తోందని వీడియోని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా సైంటిఫిక్ తరహాలో, ఏలియన్స్, గ్రహాంతరవాసుల నేపథ్యంలో రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గ్లోబల్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక తమిళ్లో మెర్సల్, తేరి, బిగిల్ సినిమాలతో పాటు బాలీవుడ్లో జవాన్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అట్లీ (Atlee) ఇప్పుడు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తో సినిమా చేయనుండడంతో వీరిద్దరి కాంబో బాక్సఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడాది చివరిలో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/PanIndiaReview/status/1909686287055081841


