పవన్ ‘వీరమల్లు’ నుంచి నుంచి అదిరిపోయే అప్​డేట్​​

by | Apr 11, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు. నిజానికి ఈ సినిమా మార్చి నెల 28నే విడుదల కావాలి. కానీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల విడుదల తేదీని మే 9కి వాయిదా వేశారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం మే 9న హరిహర వీరమల్లు విడుదలవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ మూవీ పోస్ట్ ప్రోడక్ష‌న్ ప‌నులు, రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, డ‌బ్బింగ్ వర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మే 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నట విశ్వరూపాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండ‌డంటూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దింతో ఈ సినిమా చెప్పిన తేదికే రావడం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఇటీవలే ఖమ్మంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు మేకర్స్. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ (Hari Hara Veera Mallu) పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.