మంచు ఫ్యామిలీ వివాదాలకు కొత్త కాదు. అయితే ప్రస్తుతం మంచు బ్రదర్స్ అయిన మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య వివాదం రోజు రోజుకి ముదిరిపోతోంది.
తాజాగా మంచు విష్ణు పై, మంచు మనోజ్ ఎక్స్ లో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో ది లెజెండ్ అఫ్ దొంగప్ప జూన్ 27 వస్తున్నాడు అని పెట్టాడు. అంతే కాకుండా 80% కమిషన్ తో 100 కోట్ల బడ్జెట్ సినిమా తీశారు. మీ పి ఆర్ టీం కేక అని రాసుకొచ్చారు
అంతే కాకుండా ఇంతకీ కన్నప్ప సినిమా జూన్ 27 న వస్తోందా, లేక జులై 17 న వస్తోందా అని అని సెటైర్ లు కూడా వేశాడు,. అంతే కాకుండా డబ్బు సంచితో పారిపోతోన్న ఒక దొంగ ఇమేజ్ ని షేర్ చేశాడు.
ఇంటి పెద్ద అయిన మోహన్ బాబు కలగచేసుకుని ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే అన్న, తమ్ముల మధ్య వైరం ఇంకా ఎంత దూరం వెళుతుందో?


