మళ్ళీ  ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ; పేలవ బ్యాటింగ్ , బౌలింగ్

by | Apr 7, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది

153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ కూడా మొదట్లో కొంచెం తడబాటుకు గురైంది.  16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 5 పరుగులు చేసి అవుట్ అవగా, బట్లర్ డక్ అవుట్ అయ్యాడు

అయితే వాషింగ్టన్ సుందర్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ లు మూడవ వికెట్ కు 90 పరుగులు జోడించారు. ముఖ్యంగా సుందర్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. సిమర్జీత్ వేసిన ఒక ఓవర్ లో 20 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ మీద ఒత్తిడిని తగ్గించేశాడు. అయితే 29 బంతుల్లో 49 పరుగులు చేసిన సుందర్ షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన రూథర్ ఫోర్డ్ తో జత కలిసిన శుభ్ మన్ గిల్ నాలుగవ వికెట్ కు అజేయంగా 47 పరుగులు జోడించి గుజరాత్ టైటాన్స్ ను గెలిపిచించారు. రూథర్ ఫోర్డ్ 16 బంతుల్లో 35 పరుగులు, శుభ్ మన్ గిల్ 43 బంతుల్లో 61 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు 

గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని 16.4 ఓవర్ల లోనే ఛేదించింది

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో షమీ రెండు వికెట్లు, కమ్మిన్స్ ఒక వికెట్ తీశారు

నాలుగు కీలక వికెట్లు తీసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ సిరాజ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది వరసగా నాలుగో ఓటమి

అంతకు ముందు టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల 152 నష్టానికి పరుగులు చేసింది

ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి,  సన్ రైజర్స్ హైదరాబాద్ , రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన ట్రావిస్ హెడ్ వికెట్ ను కోల్పోయింది. కాసేపటికి 18 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, 17 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ వికెట్ ను కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్

50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ లు నాలుగవ వికెట్ కు 50 పరుగులు జోడించారు.  ఇన్నింగ్స్ గాడిన పడుతోంది అని అనుకునే లోపు, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది.  15.1 ఓవర్ల లో 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్

ఆ తరవాత వచ్చిన అనికేత్ వర్మ 18 పరుగులు, కెప్టెన్ కమ్మిన్స్ బాధ్యతాయుతంగా ఆడి 9 బంతుల్లో 22 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది.  అయితే హైదరాబాద్ పిచ్ మీద  150+ పరుగులు చేస్తే కనీసం గెలవడానికి పోరాడవచు

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో పేసర్ సిరాజ్ నాలుగు  వికెట్లు తీయగా,  ప్రసిద్ కృష్ణ,  స్పిన్నర్ సాయి కిశోర్ లు రెండేసి వికెట్లు తీశారు