ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల 152 నష్టానికి పరుగులు చేసింది
ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి, సన్ రైజర్స్ హైదరాబాద్ , రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన ట్రావిస్ హెడ్ వికెట్ ను కోల్పోయింది. కాసేపటికి 18 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, 17 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ వికెట్ ను కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్
50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ లు నాలుగవ వికెట్ కు 50 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ గాడిన పడుతోంది అని అనుకునే లోపు, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. 15.1 ఓవర్ల లో 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్
ఆ తరవాత వచ్చిన అనికేత్ వర్మ 18 పరుగులు, కెప్టెన్ కమ్మిన్స్ బాధ్యతాయుతంగా ఆడి 9 బంతుల్లో 22 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. అయితే హైదరాబాద్ పిచ్ మీద 150+ పరుగులు చేస్తే కనీసం గెలవడానికి పోరాడవచు
గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో పేసర్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా, ప్రసిద్ కృష్ణ, స్పిన్నర్ సాయి కిశోర్ లు రెండేసి వికెట్లు తీశారు

