‘అన్ స్టాపబుల్ 4’ లో గేమ్ ఛేంజర్ టీం సందడి చేయబోతోంది. ఇప్పటికే ‘అన్ స్టాపబుల్ 4’ లో బాల కృష్ణ ‘డాకు మహారాజ్’ టీం సందడి చేయబోతోంది అన్న విషయం తెలిసిందే.
ఈ నెల 31 న గేమ్ ఛేంజర్ టీంతో షూట్ జరగబోతోంది. ఎపిసోడ్ మాత్రం గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ఒక మూడు, నాలుగు రోజుల ముందు స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ ప్రొమోషన్స్ మెల్ల మెల్లగా ఊపందుకుంటున్నాయి. నిన్న విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ కట్ అవుట్, దిల్ రాజు స్పీచ్ సినిమా ప్రొమోషన్స్ కి ఎంతగానో హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్, RRR Beyond & Behind ఎపిసోడ్ తో ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచింది. న్యూ ఇయర్ కి ట్రైలర్ వస్తోంది, ఆపైన పవన్ కళ్యాణ్ అథితిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనే ఉంది

