రోహిత్, విరాట్ ల కు రిటైర్ అయ్యే టైం వచ్చిందా 

by | Dec 30, 2024 | వార్తలు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు కీలక టెస్ట్ సిరీస్ లలో ఘోరంగా విఫలమవుతున్న సీనియర్లకు రిటైర్ అయ్యే టైం వచ్చిందా అంటే, అవుననే చెప్పవచ్చు. 

హిట్ మాన్, రోహిత్ శర్మ ఈ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు. రెండవ టెస్ట్ లో వరసగా రెండు ఇన్నింగ్స్ లో 3, 6 పరుగులు చేశాడు.  ఆ తరవాత మూడవ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ లో రెండు ఇన్నింగ్సలలో 3, 9 పరుగులు చేశాడు

బ్యాట్స్ మన్ గానే కాకుండా కెప్టెన్ గా  కూడా దారుణంగా విఫలమవుతున్నాడు.  న్యూజిలాండ్ సిరీస్ వైట్ వాష్ కు గురి అయ్యిన భారత జట్టును గవాస్కర్, బోర్డర్ ట్రోఫీలో ముందుండి నడిపించాల్సిన రోహిత్ శర్మ బ్యాట్స్ మాన్ గా విఫలమవడమే కాకుండా ఏ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావాలో కూడా తేల్చుకోలేని పరిస్థితి.  కెప్టెన్ గా కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.  రోహిత్ శర్మ ఆట చూస్తే,  ఈ సిరీస్ లో భారత జట్టు 10 మంది సభ్యులతో ఆడినట్లు అనిపిస్తోంది.

మరో సీనియర్ బ్యాట్స్ మాన్ అయిన విరాట్ కోహ్లీ కి మినహాయింపు ఏమి లేదు.  అయితే రోహిత్ శర్మ తో పోలిస్తే విరాట్ పరవాలేదనిపించాడు. ఒక సెంచరీ చేశాడు. అయితే కీలక సమయాల్లో విఫలమవుతున్నాడు.

విదేశీ పిచ్ ల మీద ఆడేటప్పుడు సీనియర్ లు అయిన రోహిత్, విరాట్ జట్టును ముందుకు నడిపించాలి. అయితే సీనియర్ ప్లేయర్ల వైఫల్యాలు జట్టు తీవ్రంగా ప్రభావితం చేశాయి.  రోహిత్ లో ఒకప్పటి జోష్ కనిపించడం లేదు

 జట్టు బౌలింగ్ లో బుమ్రా బ్యాటింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే ఈ సిరీస్ లో నిలకడగా రాణించారు.  బౌలింగ్ లో సిరాజ్ పరవాలేదనిపించాడు.