కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాట లేదు గేమ్ చేంజర్ లో

by | Jan 10, 2025 | సినిమా

రామ్ చరణ్ హీరో గా, శంకర్ దర్శకత్వం లో విడుదలైన గేమ్ చేంజర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత.

అయితే, ఈ గేమ్ చేంజర్ లో 5 పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టారు.  ఇంత ఖర్చు పెట్టి సినిమాలో మంచి మెలోడియస్ గా సాగే ‘నానా హైరానా’ లేదు.  ఇంత ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ కు పాట రెడీ చేయలేక పోవడం నిర్మాత, దర్శకుడి ఫెయిల్యూర్ గా చెప్పవచ్చు. పైగా ఈ పాటను జనవరి 14 నుండి సినిమాలో పెడతారట.

మిగతా పాటలు కూడా విజువల్స్ పరంగా గొప్పగా ఉన్న, అవి సినిమా విజయానికి ప్లస్ అయ్యేలా లేవు. పైగా పాటలన్ని ఒక పల్లవి, ఒక చరణం తోనే ఉన్నాయి.