గేమ్ చేంజర్ మూవీ రివ్యూ : ఆట మర్చిపోయిన శంకర్

by | Jan 10, 2025 | సినిమా రివ్యూ

సినిమా                        : గేమ్ చేంజర్

మార్కులు                   : 50/100

విడుదల తేదీ              : 10-01-2025

నిర్మాణ సంస్థ              : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,  జీ స్టూడియో

నటీ నటులు                : రామ్ చరణ్, కియారా అద్వానీ, సూర్య , శ్రీకాంత్, అంజలి

సంగీతం                      : తమన్

నిర్మాత                        : దిల్ రాజు

రచన                           : కార్తీక్ సుబ్బరాజు, బుర్ర సాయి మాధవ్,  శంకర్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శంకర్ 

కధ

సింపుల్ గా కధ ఏంటి అని చెప్పాలంటే, ఒక ఐ ఏ ఎస్ అధికారికి, రాజకీయ నాయకుడి కి మధ్య జరిగే సంఘర్షణ.  దీనికి బ్యాక్ స్టోరీ గా, గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చిన వారి తరపున పోరాడే అప్పన్న (Ram Charan) అనే వ్యక్తి ఊరి ప్రజలు కోరుకోవడం తో. డబ్బులు లేని రాజకీయాల కోసం ఒక పార్టీ పెడతాడు.  అయితే తనకు అయినవాళ్లు, తన చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేసి చంపేస్తారు. అతని భార్య గా అంజలి నటించారు. అతనికి కొడుకుగా రామ్ చరణ్ (రామ్ నందన్) నటించారు

బలాలు 

రామ్ చరణ్

ఎస్ జె సూర్య

ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిముషాలు

సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ (అప్పన్న ఎపిసోడ్)

థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

డైలాగ్స్

బలహీనతలు

కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శంకర్

విశ్లేషణ

దిల్ రాజు, సుకుమార్ ఈ సినిమా గురించి ఊదర కొట్టేశారు.  భారీ అంచనాలతో వెళ్లే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదు. 
పాత చింతకాయ పచ్చడి లాగ హీరో ఇంట్రడక్షన్ ఒక ఫైట్, ఒక పాట తో మొదలు పెట్టాడు దర్శకుడు శంకర్. 

హీరో ని (రామ్ చరణ్) ఐ ఏ ఎస్ గా ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ఒక లవ్ స్టోరీ (హీరోయిన్ కియారా అద్వానీ) ట్రాక్ స్టార్ట్ చేశాడు.  

సినిమాటిక్ లిబర్టీ విచ్చలవిడిగా వాడుకుని రామ్ చరణ్ ని ఒక ఐ పి ఎస్, ఒక ఐ ఏ ఎస్, ఒక చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్, ఒక ముఖ్యమంత్రిగా రకరకాల పాత్రలలో చూపించాడు దర్శకుడు.  ఏ పాత్రలో ఎంత సేపు ఉంటాడో తెలియదు.  అన్ని ఆలా, అలా జరిగిపోతాయి. వెళ్లిపోతాయి.  ఏం జరిగిందో ప్రేక్షకుడికి అర్ధం కాదు.  సినిమా నిడివి తక్కువగా ఉండాలి అని, సోల్ ని గాలికి వదిలేశాడు శంకర్

రంగ స్థలం లో చిట్టి బాబు తరహా పాత్ర ఒకటి రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో క్రియేట్ చేశాడు.  అప్పన్న పాత్రలో రామ్ చరణ్ బాగా నటించినప్పటికీ ఎమోషనల్ సన్నీ వేశాలు అంతగా పండలేదు.  ఎమోషనల్ సన్నివేశాలు బలం గా పాండే సన్నివేశాలు రాసుకోలేదు

ఇక ఆ తర్వాత సినిమా అంతా, రామ్ చరణ్, సూర్య పాత్రల మధ్య సంఘర్షణ మాత్రమే.  సగటు ప్రేక్షకుడికి ఇవి అంతగా రుచించక పోవచ్చు.  మరి ముఖ్యం గా రామ్ చరణ్ అభిమానులకు.  అయితే ఫామిలీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చవచ్చు

సినిమా క్లైమాక్స్ గురించి అసలు చెప్పుకోనక్కర్లేదు.  చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీస్ ఆఫీసర్, ముఖ్యమంత్రి అభ్యర్ధికి మధ్య వార్. ఇక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ బాగా వాడుకున్నాడు.

అసలు శంకర్, ఈ సినిమా కి గేమ్ చేంజర్ అని పేరు ఎందుకు పెట్టాడు.  ఇంతకీ ఈ సినిమా ద్వారా శంకర్ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడు. అర్ధవంతమైన స్క్రీన్ ప్లే రాయడంలో రచయితలు, దర్శకుడు ఘోరంగా విఫలమయ్యారు

పాటలు

ఈ సినిమాలో పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టారని గొప్పగా చెప్పారు.  పాటలు విజువల్స్ పరంగా బాగున్నాయి.  కానీ, అంత ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం లేదు.  న్యూజి ల్యాండ్ లో తీసిన ‘నానా హైరానా’  సాంగ్ సినిమాలో లేపేశారు.  ఉన్న పాటలలో మెలోడియస్ గా ఉన్న ఆ పాటను లేపేశారు

సంగీతం : ఈ సినిమాని తమన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు కాపాడిందనే చెప్పాలి.

బడ్జెట్

ఈ సినిమా అగ్రీమెంట్లు 2020 లో చేసుకున్నారు.  2021 లో మొదలు పెట్టారు.  2025 జనవరి లో విడుదల చేశారు.  ఇన్ని సంవత్సరాలు నిర్మాణంలో ఉండి పోవడానికి కారణం ఎవరు. ఎప్పుడు బడ్జెట్ విషయంలో లెక్కలు వేసుకునే దిల్ రాజు ఈ సినిమా కు అంత ఖర్చు పెట్టడానికి, ఏనాడు ఆలోచించలేదా.  దిల్ రాజు జడ్జిట్మెంట్ గాడి తప్పుతోంది ఎందుకని.  శంకర్ కి ఓపెన్ గా చెప్పలేకపోయాడా.  అన్ని సంవత్సరాలు, అంత ఖర్చు పెట్టి తీయడానికి ఈ సినిమాలో ఏముందో దిల్ రాజు, జీ స్టూడియో వాళ్ళకి, దర్శకుడు శంకర్ కి మాత్రమే తెలియాలి

శంకర్ :

భారతీయుడు, ప్రేమికుడు, శివాజీ, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్ మాన్, రోబో వంటి గొప్ప చిత్రాలను తీసి దక్షణాది సినిమాలను పాన్ ఇండియా స్థాయికి ఏనాడో తీసుకు వెళ్లిన దరసకుడు శంకర్ కి సినిమాల మీద పట్టు పూర్తి గా పోయింది.  భారతీయుడు-2 పరాజయం నుండి శంకర్ ఏం నేర్చుకున్నాడు.  ఎన్నో ఆశలతో థియేటర్ కి వచ్చిన రామ్ చరణ్ అభిమానుల గుండె ముక్కలయింది.

ఈ సినిమా శంకర్, దిల్ రాజు, రామ్ చరణ్ ల కు ఎంతో ముఖ్యం.  అయినా, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా శంకర్ తన పంధా మార్చుకోవాలి.  అనవసరమైన బడ్జెట్ ని తగ్గించుకోవాలి. కధ, స్క్రీన్ ప్లే లో దమ్ము ఉంటె చిత్ర నిడివి మూడు గంటలు దాటినా సినిమా చూస్తారు.  కంటెంట్ లో దమ్ము లేకపోతే ప్రేక్షకుడు ఒక గంట కూడా కూర్చోలేడు

ఈ సినిమా టైటిల్ గేమ్ చెంజర్ కి, కధ కి సంబంధం ఏంటి.  ఈ చిత్రం ద్వారా శంకర్ ఏం  చెప్పాలనుకున్నాడు. డైలాగ్స్ బాగున్నా సినిమా కధకు, స్క్రీన్ ప్లే కి పొంతన లేకపోవడం,  ఎమోషనల్ సన్నివేశాలు పండక పోవడం, సూర్య, రామ్ చరణ్ ల సంఘర్షణ అర్ధవంతం గా లేక పోవడం వలన సంభాషణలు బాగున్నా, కొట్టుకు పోయాయి

భారీ అంచనాలతో సినిమాకి వెళ్ళకండి.  నిరుత్సహపడతారు.

ప్రేక్షకులను ఆకట్టుకునే  కధ, కధనాలు లేక పోతే ఎంత ఖర్చు పెట్టిన బూడిదలో పోసిన పన్నీరే

ఇక భారతీయుడు 3 పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి  

చివరగా :  సినిమాలనైనా శంకర్ మర్చిపోవాలి.  ప్రేక్షకులు శంకర్ ని అయినా మర్చిపోవాలి