ఈటీవీ లో ‘అమ్మోరు’ రేపే విడుదల

by | Feb 15, 2026 | టీవీ & ఓటిటి

ఈటీవీ (ETV) – సామాన్యులను కూడా సెలబ్రిటీ స్థాయికి తీసుకువెళ్లగలిగే ఛానల్.  అంతే కాకుండా ఎంతో మంది కి ఉపాధి కల్పించడమే కాకుండా, ఎంతో మంది గాయకులను, నటులను, దర్శకులను, సంగీత దర్శకులను చిత్రసీమ కు పరిచయం చేసింది ఈటీవీ సంస్థలే.

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ (Mallemala Entertainments) అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేరు తెలియని వాళ్ళు ఉండరు.  తీసినవి తక్కువ సినిమాలే అయిన అన్ని సంచలన విజయాలు సాధించినవే.

తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలు తీసి ఘన విజయం సాధించారు. 

2004 లో అంజి సినిమా, 1995 లో ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్ తో అమ్మోరు లాంటి సినిమాలు  తీసి ఘన విజయ సాధించారు.  ముఖ్యంగా అమ్మోరు సినిమా  తెలుగు సినిమా చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది

సినిమా రంగం నుండి టీవి రంగానికి వచ్చాక ఈటీవీ ఛానల్ వారికి  జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ, క్యాష్, స్టార్ మహిళా వంటి కార్యక్రమాలతో నాన్ ఫిక్షన్ కేటగిరీ లో ఒకే బెంచ్ మార్క్ సెట్ చేశారు.

ఈటీవీ, మల్లెమాల సంస్థలు కలిసి తీసుకు వస్తోన్న సీరియల్ అమ్మోరు. Ammoru సినిమా ఆధారంగా తీసిన ఈ సీరియల్ రేపటి నుండి అంటే ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7.30 గంటలకు ఈటీవీ (ETV) లో ప్రసారమవుతుంది.