టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ వ్యయంతో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ‘AA22 x A6’ (AA22 x A6) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, దీనిపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
అందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటపడకుండా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి తెలుస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల ఈ విషయంపై జాన్వీ కపూర్ తో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ఈ విషయాన్ని త్వరలోనే మేకర్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

