దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వవహించారు. సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని నిర్మించారు
జి వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యం గా ‘కోపాలు చాలండి శ్రీమతి గారు’ పాట సూపర్ హిట్ అయ్యింది
బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పుడు ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా వారు వచ్చే ఆదివారం అనగా, జనవరి 19 న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబోతున్నారు

