వన్ డే లో ట్రిపుల్ సెంచరీ తో ఇరా జాదవ్ విధ్వంసం

by | Jan 12, 2025 | వార్తలు

భారత జట్టు మహిళా క్రికెటర్ నూతన సంవత్సరం లో సంచలనం సృష్టించింది.  టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టడం కష్టం.  వన్ డే మ్యాచ్ లో జట్టంతా కలిసి 300 పరుగులు చేయడం కూడా కష్టమే.  అయితే  అండర్ 19 స్థాయిలో ముంబై, మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, భారత మహిళా జట్టు యువ క్రికెటర్ విధ్వంసం సృష్టించింది 

ముంబై, మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్ లో, మొదట  బ్యాటింగ్ చేసిన ముంబై, నిర్ణీత 50 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 563 పరుగులు చేసింది. 

14 ఏళ్ళ భారత మహిళా యువ బ్యాటర్ ఇరా జాదవ్, కేవలం 157 బంతుల్లో 346 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో 43 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.  అంతే కాకుండా, భారత యువ మహిళా జట్టు కెప్టెన్ హుర్లే గాల 116 పరుగులతో రాణించింది 

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మేఘాలయ కేవలం 19 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మేఘాలయ కేవలం 19 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.  దీనితో ముంబై 544 పరుగుల భారీ తేడాతో మేఘాలయ పై ఘన విజయం సాధించింది