70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ’

by | Jan 11, 2025 | ప్రగడ టీవీ

70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ సినిమా జనవరి 12, 1955 న విడుదలయ్యింది.  ఈ సినిమా, అప్పట్లోనే, 100 రోజులు ఆడింది

విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, నాగి రెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎల్ వి ప్రసాద్

ఈ సినిమాలో ముఖ్య తారాగణం : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్ వి రంగారావు, సావిత్రి, జమున

సంగీతం : ఎస్ రాజేశ్వర రావు | సినిమాటోగ్రఫీ : మార్కస్ బార్ట్లే

మిస్సమ్మ సినిమా, రబింద్రనాథ్ మైత్ర రాసిన ‘మన్మోయీ గర్ల్స్ స్కూల్’ అనే బెంగాలీ నవల ఆధారంగా తీసిన కళాఖండం ‘మిస్సమ్మ’

కధ

ఇద్దరు నిరుద్యోగులైన ఎం.టి. రావు మరియు మేరీ అనే వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వారు గోపాలం అనే జమిందార్ స్థాపించిన ఒక పాఠశాలలో ఉద్యోగం పొందటానికి పెళ్లి అయిన దంపతులుగా పోసు పెడతారు. రావు మరియు మేరీ ఒకరికి ఒకరు ప్రేమలో పడుతుంటే, గోపాలం మేనల్లుడు ఎ.కే. రాజు, చిన్నప్పుడు తప్పిపోయిన తన మావయ్య కూతురు మహాలక్ష్మి, ఈ మేరీ ఒక్కరేనని తెలుసుకుంటాడు.

మిస్సమ్మ గురించిన సంగతులు

  • మిస్సమ్మ సినిమాని తమిళం, హిందీ లో కూడా తీశారు
  • ఈ మిస్సమ్మ సినిమా ని ప్రముఖ దర్శకుడు బాపు, ముళ్లపూడి వెంకట రమణ, రావి కొండలరావు కొన్ని మార్పులు చేసి 1991 లో ‘పెళ్లి పుస్తకం’ అని తీశారు.
  • మిస్సమ్మ సినిమాలో అనేక అంశాలను టచ్ చేశారు
  • యాచకులు దుస్థితి పై ‘బాబు ధర్మం చెయ్’ అనే పాటను
  • సీతారాం, సీతారాం అనే పాట అవినీతి పరులైన రాజకీయ నాయకుల మీద సెటైర్ (ముఖ్యం గా ఈ లైన్ -చందాలంటూ భలే ప్రచారం, వందలు, వేలు తమ ఫలహారం)
  • అంతే కాకుండా, కుల, మతాల అంతరాలు మరియు నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఈ సినిమాలో మాట్లాడారు 
  • అంతే కాకుండా ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’ అనే లైన్ బాగా పాపులర్ అయ్యింది.  అంతే కాకుండా రేలంగి వాడిన  ‘తైలం’ అనే పదం డబ్బు కు పర్యాయపదం అయ్యింది
  • తెలుగు చిత్ర పరిశ్రమ లారెల్ అండ్ హార్డీ లుగా రమణ రెడ్డి, రేలంగి ఖ్యాతి గాంచారు

‘ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే’ పాటను పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో రీమిక్స్ చేశారు సంగీత దర్శకుడు మణి శర్మ

‘రావోయి చందమామ’ పాటను మంచు విష్ణు తన సినిమాలో రీమిక్స్ చేశారు

ఇప్పటికి ఈ సినిమా ఈటీవీ, ఈటీవీ సినిమా ఛానెళ్లలో ప్రసారమవుతుంది.  రేటింగ్స్ కూడా బాగా వస్తాయని సమాచారం. 

ఈటీవీ సినిమా ఛానల్ లో,  మిస్సమ్మ సినిమాని జనవరి 12, ఉదయం 11 గంటలకు ప్రసారం చేస్తున్నారు