ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్

by | Jan 31, 2025 | రాజకీయాలు

మరో ఐదు రోజుల్లో, అంటే ఫిబ్రవరి 5 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.  ఎన్నికలకు ఐదు రోజుల ముందు కేజ్రీవాల్ కు పెద్ద షాక్

కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు

కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయినట్లుగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు

రాజీనామా చేసిన వారిలో త్రిలోకపురి ఏం ఎల్ ఏ రోహిత్ మెహరౌలీయ, జనకపురి ఏం ఎల్ ఏ రాజేష్, కస్తూర్బా నగర్ ఏం ఎల్ ఏ మదన్ లాల్, మెహరౌలీ ఏం ఎల్ ఎ నరేష్ యాదవ్, ఆదర్శ్ నగర్ ఏం ఎల్ ఏ పవన్ శర్మ, బిజ్వాసన్ ఏం ఎల్ ఏ  జూన్, భావన గౌర్  ఉన్నారు.  ఏం ఎల్ ఏ లు అందరు రాజీనామా లేఖలను స్పీకర్ కు పంపారు

అయితే కొసమెరుపు ఏంటంటే, రాజీనామా చేసిన ఏడుగురు ఏం ఎల్ ఏ లకు ఈ సారి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఆప్ నుండి రాలేదు

ఈ ఏడుగురు బీజేపీ లో చేరతారా లేదా బీజేపీ కి ఏమైనా లీకులు అందిస్తారా అన్నది తెలియాలి.  దీనిమీద ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

ఏం ఎల్ ఏ రాజీనామా ప్రభావం ఆప్ విజయావకాశాలను  దెబ్బ తీస్తాయా.  ఈ అవకాశాన్ని బీజేపీ ఎలా వాడుకుంటుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే

ఫిబ్రవరి 5 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, 8 న కౌంటింగ్ జరుగుతుంది