కెసిఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

by | Jan 31, 2025 | వార్తలు

కెసిఆర్ అసెంబ్లీ కి వస్తే మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వివరాలను లెక్కలతో సహా చెపుతాను అని తెలంగాణ ముఖమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 

పది ఏళ్ళ పాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ని దివాళా  రాష్ట్రం గా మార్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ ని ఆరోపించారు

పది ఏళ్ళ పాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ని అప్పుల రాష్ట్రం గా మార్చారు. అంతే కాకుండా ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని రైతు బంధు ఎగ్గొడితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 7,625 కోట్ల రూపాయల రైతు బందును మూడు నెలలో ఇచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు.

కెసిఆర్ ఇచ్చిన రైతు రుణ మాఫీ మిత్తికే సరిపోయిందని అన్నారు. 2018-23 వరకు 11 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే,  అందులో 8,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తికే సరిపోయింది. ఆయన చేసిన రుణ మాఫీ నికరంగా, కేవలం 3000 కోట్ల రూపాయలు అన్నారు.  రైతురుణమాఫీ మీద అసెంబ్లీ కొస్తే చర్చిద్దామని రేవంత్ రెడ్డి అన్నారు

సరిగ్గా 60 రోజుల్లో 2 లక్షల రూపాయల రైతు మాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు

రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ వచ్చింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చాం, ఆడ బిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చాం.   10 వేల  కోట్ల రూపాయలు,  మార్చ్ 31 లోపు రైతు భరోసా కింద పేదల  అకౌంట్లో వేస్తామ్. ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి కుటుంబానికి 12 వేలు ఇచ్చాము.  నిరుద్యోగ సమస్య పరిష్కరించదానికి మొదటి సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చిత్త శుద్ధి ఉంటె, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటె, అసెంబ్లీకి రా, వివరాలన్నీ ముందు పెడతా, చర్చిద్దాం అని ముఖ్యమంత్రి అన్నారు.

నేను కొడితే గట్టిగా కొడతాను అన్న కెసిఆర్ మాటలకూ రేవంత్ రెడ్డి చేతి కర్ర లేకుండా ముందు నడవమని కెసిఆర్ కు చురకలంటించారు.

భారస కు సోషల్ మీడియా లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ లైక్ లు

 వచ్చాయని కెసిఆర్ కార్యకర్తలకు చెప్పుకుంటున్నాడని,  సల్మాన్ ఖాన్ కు, రాఖి సావంత్ కు టిక్ టాక్ లో పెడితే రాఖి సావంత్ కు ఎక్కువ లైక్ లు వచ్చాయని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు   సరిగ్గా 60 రోజుల్లో 2 లక్షల రూపాయల రైతు మాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదే గెలుపుని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.