భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య పుణె లో జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్ ల నష్టానికి 181 పరుగులు చేసింది
మహమూద్ వేసిన ఇన్నింగ్స్ రెండవ ఓవర్ లో భారత జట్టు మూడు వికెట్ లను కోల్పోయింది. సంజు శాంసన్ 1 పరుగు చేసి అవుట్ అవ్వగా, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డక్ అవుట్ అయ్యారు
ఆ తరవాత రింకు సింగ్, అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే అభిషేక్ శర్మ 29 పరుగుల వద్ద, రింకు సింగ్ 30 పరుగుల వద్ద అవుట్ అయ్యారు
79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టును శివమ్ దూబే, హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఇద్దరు చెరో 53 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో మహమూద్ మూడు వికెట్లు, ఓవర్తన్ రెండు వికెట్లు తీయగా, కార్స్, రషీద్ చెరో వికెట్ తీశారు

