ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో భాజపా తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఆప్ ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టమవుతోంది. కేజ్రీవాల్ పై ఢిల్లీ ఓటర్ లు విసుగు చెందారు. డబల్ ఇంజిన్ సర్కార్ కు ఓట్ వే శారు.
ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ వెనుకంజలో ఉండడంతో ఢిల్లీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలుస్తోంది. అతిశీ, సిసోడియా లు కూడా వెనుకంజలో ఉన్నారు. ముస్లిం ఓటర్ లు కూడా భాజపా వైపే మొగ్గు చూపారు
ప్రస్తుతం బీజేపీ 50 స్థానాలలో ఆధిక్యం లో ఉంది. ఆప్ 19 స్థానాలలో ఆధిక్యం లో ఉంది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానం లో ఆధిక్యం లో ఉంది
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 36. ఇప్పటికే భాజపా 50 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. భారతియ జనతా పార్టీ కి 52% ఓట్లు వచ్చాయి

