ఓడిపోయిన ఆప్ ఉప ముఖ్య మంత్రి, మాజీ ముఖ్య మంత్రి

by | Feb 8, 2025 | రాజకీయాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.  ఆప్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, ఢిల్లీ ఓటర్ లు, ఓటు ద్వారా చెప్పకనే చెప్పారు.

జంగపురా లో బీజేపీ అభ్యర్థి తరవీందర్ సింగ్  చేతిలో ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు

న్యూ ఢిల్లీ లో ఆప్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 1200 ఓట్ల కు పైగా తేడాతో ఓడిపోయారు

కల్కాజి నియోజకవర్గంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీ భవితవ్యం కూడా మరో మూడు రౌండ్లలో తేలనుంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి 238 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు