పీఎం మోడీ కి ధన్యవాదాలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి

by | Feb 8, 2025 | వార్తలు

భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యం గా ఈ సంవత్సరం చివరిలో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES) ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే

ఈ నేపథ్యంలో కొంత మంది సీనియర్ నటులు, వ్యాపార వేత్తలతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వీరి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వీడియో ను మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.   

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ @narendramodi జీ, ఈ గౌరవానికి ధన్యవాదాలు. 🙏🙏

WAVES (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) సలహా బోర్డులో భాగం కావడం మరియు ఇతర గౌరవనీయ సభ్యులతో పాటు నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెగా స్టార్ చిరంజీవి తో పాటు అమితాబ్ బచ్చన్, రజని కాంత్, మిదున్ చక్రవర్తి, నాగార్జున, షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమ మాలిని, దీపికా పదుకొనె పాల్గొన్నారు.  అంతే కాకుండా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమావేశం లో పాల్గొని వారి సలహాలను, అభిప్రాయాలను తెలియ చేశారు