ఈ ఐదు సినిమాలు రేపే విడుదల

by | Mar 13, 2025 | సినిమా

కోర్ట్ : ప్రియదర్శి, శివాజీ, హర్ష రోహన్, శ్రీదేవి నటించిన కోర్ట్ ఈ మార్చ్ 14 న విడుదలవుతోంది.  రామ్ జగదీష్ దర్శకత్వం వవహించారు.  నాని సమర్పణలోవాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కోర్ట్ సినిమా రివ్యూ బయటకు వచ్చేసింది ఎందుకంట పెయిడ్ ప్రీమియర్ లు వేశారు ఈ రోజు

దిల్ రుబా : క విజయం తరవాత కిరణ్ సబ్బవరం నుండి వస్తోన్న లవ్ స్టోరీ. రుక్సార్ థిల్లాన్ ఇందులో కధానాయిక.  విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా హోలీ సందర్భముగా ఈ మార్చ్ 14 న విడుదలవుతోంది

ఆఫీసర్ ఆన్ డ్యూటీ : మలయాళ డబ్బింగ్ సినిమా. ఇంతకు ముందే విడుదలవాల్సిన ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా కూడా మార్చ్ 14 న విడుదలవుతోంది.  కునచకో బొబన, ప్రియమణి ప్రధాన తారాగణం.  ఈ సినిమా ను  ఒక క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు

జాన్ అబ్రహం,సాదియా, కుముద మిశ్రా,షరిబ్, రేవంతి నటించిన హిందీ చిత్రం ‘ది డిప్లొమాట్’  శివమ్ నాయర్ ఈ చిత్రానికి దర్శకుడు. నిజ జీవితంలో జరిగిన  రాజకీయ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కధ  నడుస్తుంది. ఈ సినిమా మార్చ్ 14 న విడుదలవుతోంది

కార్తీ హీరోగా 2010 లో వచ్చిన చిత్రం యుగానికి ఒక్కడు. ఆండ్రియా, రీమా సేన్ లు కధానాయికలు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు వారిని కూడా మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ మనం ముందుకు రాబోతోంది ఈ మార్చ్ 14 న

అక్కినేని అఖిల్ నటించింది ఏజెంట్ సినిమా ఎట్టకేలకు విడుదలైన రెండు సంవత్సరాలకు ఓ టి టి లోకి రాబోతోంది.  సోనీ లివ్ లో, మార్చ్ 14 నుండి ఏజెంట్ స్ట్రీమ్ అవబోతోంది

అయితే ఎక్కువగా కోర్ట్ రూమ్ డ్రామా తో తెరకెక్కిన కోర్ట్ చిత్రం మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.  నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులో నాని కోర్ట్ సినిమా నచ్చితేనే హిట్ 3 చూడండి అని ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించారు .  అంతే కాక క విజయం తరవాత కిరణ్ సబ్బవరం నుండి వస్తున్న సినిమా, అది కూడా సెన్సార్ టాక్ బావుంది అన్న టాక్ రావడంతో దిల్ రుబా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.