సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 కి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విష్యం తెలిసిందే. ఈ సినిమా అటు వెంకటేష్ కెరీర్ లోనే కాదు, ఇటు అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్. అంతే కాకుండా, ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని దిల్ రాజు కు కూడా సంక్రాంతి కి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు
థియేట్రికల్ రన్ లో సుమారు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మార్చ్ 1 న సాయంత్రం 6 గంటలకు అటు జీ తెలుగులో , జి 5 లో ఒకేసారి ప్రీమియర్ చేశారు. జీ 5 లో రికార్డు స్థాయి వ్యూస్ దూసుకుపోతోన్న సంక్రాంతి కి వస్తున్నాం సినిమా జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసినప్పుడు
15. 9 రేటింగ్ సాధించింది. వకీల్ సాబ్ తరవాత జీ తెలుగు ఎక్కువ రేటింగ్ వచ్చింది మాత్రం ఈ సినిమాకే. అయితే సంరకాంతికి వస్తున్న లాంటి చిత్రం ప్రీమియర్ 15.9 రేటింగ్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటె గతంలో నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రానికే 14 రేటింగ్ వచ్చింది. దానితో పోలిస్తే తక్కువ అని చెప్పాలి. మార్చ్ 1 న ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ నిర్ణయాత్మక మ్యాచ్ కూడా ఉంది
గతం లో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 (వెంకటేష్, అనిల్ రావిపూడి) స్టార్ మా 17 రేటింగ్ సాధించింది. అలా చూసినా సంక్రాంతికి వస్తున్నాం తక్కువ రేటింగ్ సాధించిందనే చెప్పాలి

