మెగాస్టార్ చిరంజీవి ని క్షమించమన్న రామ్ గోపాల్ వర్మ

by | Nov 9, 2025 | సినిమా

రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా శివ.  అప్పట్లో ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.  ముఖ్యంగా నాగార్జున సైకిల్ చైన్ ఫైట్ ఎవరు మర్చిపోరు.  ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళని ఈ సీన్ ఎంతగానో ఆకట్టుకుంది.

లైటింగ్, సౌండ్ సిస్టం తో పాటు నాగార్జున, రఘువరన్ ల నటన, ఇళయరాజా సంగీతం, రాంగోపాల్ వర్మ దర్శకత్వం ఈ శివ సినిమాను కల్ట్ క్లాసిక్ గా నిలిపాయి

ఈ సినిమా ఈ నవంబర్ 14 న రీ రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా రాంగోపాల్ వర్మ ను ప్రత్యేకంగా అభినందించారు.  అంతే కాకుండా చిరంజీవి మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ఉన్నంత కాలం శివ సినిమా చిరంజీవిలా చిరస్మరణీయం’ అని అన్నారు

గతంలో చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభమై ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవి కి ధన్యవాదాలు తెలుపుతూ, చిరంజీవి గారు, మిమ్మల్ని అనుకోకుండా ఎప్పుడైనా బాధ పెట్టివుంటే నన్ను క్షమించండి అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.  అంతే కాకుండా మంచి మనసుతో మా శివ టీం ని విష్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు అని చెప్పారు

36 ఏళ్ళ తరవాత, శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజి కి అనుగుణంగా అన్నిరకాల హంగులతో ఈ నవంబర్ 14 న విడుదల చేస్తున్నారు.