మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ సాంగ్ రికార్డుల జోరు

by | Nov 8, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి.  70 ఏళ్ళ వయసులో కూడా ఎక్కడా తగ్గట్లేదు.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న మన శంకర వర ప్రసాగారు సినిమా నుండి విడుదలైన మొదటి సింగల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ వ్యూస్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తోంది.  యూట్యూబ్ లో ఈ పాట చాలా రోజులు అల్ ఇండియా లో నెంబర్ వన్ సాంగ్ గా ట్రెండ్ అయ్యింది.  ఒక ప్రాంతీయ బాషా చిత్రం సాంగ్ అల్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవడం గొప్ప విషయమే.  ప్రస్తుతం ఈ మీసాల పిల్ల సాంగ్ 50 మిలియన్స్  కు పైగా వ్యూస్   సాధించింది.

ఉదిత్ నారాయణ్ పాడిన ఈ మీసాల పిల్ల సాంగ్ కు భీమ్స్ స్వరాలూ సమకూర్చారు.  షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు

లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో విక్టర్ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు వచ్చే సంక్రాంతి పండగకి వస్తున్నారు.