మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ చిత్రం కొదమ సింహం రీ  రిలీజ్

by | Nov 13, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం కొదమ సింహం. ఈ చిత్రంలో రాధ, సోనమ్, వాణి విశ్వనాధ్ లు కధానాయికలు.   రమా ఫిలిమ్స్ పై నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రానికి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ నటుడు ప్రాణ్ ఈ చిత్రంలో విలన్ గా నటించారు.  రాజ్-కోటి స్వరపరచిన పాటలు ఇప్పటికి సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.  ఈ చిత్రంలో స్టార్ స్టార్…మెగాస్టార్ అనే పాట ఒక ఊపు ఊపింది

1990 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా చిరంజీవి కౌబాయ్ గెట్ అప్ లో అదిరిపోయాడు.   ఈ కొదమ సింహం సినిమాని హుంటర్స్ అఫ్ ది ఇండియన్ ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్ లోకి దుబ్ చేశారు.

ఈ కొదమ సింహం సినిమాను అధునాతన హంగులతో 4K లో ఈ  నవంబర్ 21 న మళ్ళీ విడుదల చేయనున్నారు.  దీనికి సంబందించిన ప్రోమో ను విడుదల చేశారు.