యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న తండ్రి, కొడుకులు

by | Nov 12, 2025 | సినిమా

ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో రెండు పాటలు రఫ్ ఆడించేస్తున్నాయి. అందులో మొదటిది మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) , అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం నుండి ‘మీసాల పిల్ల’ సాంగ్. ఈ పాట ఇండియా లోనే నెంబర్ వన్ పాటగా చాలా రోజులు ట్రెండ్ అయ్యింది. రీసెంట్ గా రామ్ చరణ్ (Ram Charan) , బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తోన్న పెద్ది చిత్రం నుండి వచ్చిన మొదటి సింగల్ ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియా ని షాక్ చేస్తోంది

చికిరి చికిర్ (Chikiri Chikiri) సాంగ్ ఇప్పటికే, ఇండియన్ లోనే విడుదలైన 24 గంటల్లోనే ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. మీసాల పిల్ల సాంగ్, చికిరి చికిరి సాంగ్ లు రెండు 50 మిలియన్ వ్యూస్ పైడ్ సాదించండం విశేషం. ఈ రెండు పాటలకు, వయసుతో సంబంధం లేకుండా, సోషల్ మీడియా అంతా రీల్స్, షార్ట్స్ తో హోరెత్తిపోతోంది.

ఇవన్నీ ఒక ఎట్టు అయితే, డిసెంబర్ 31 న, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పాట విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట అంతకు మించి ఉంటుందని చెపుతున్నారు. మొత్తానికి చాలా రోజుల తరవాత చిరంజీవి, రామ్ చరణ్ ల పాటలు పాపులర్ అవడంతో పాటు, ఓ జి వంటి తరవాత వస్తోన్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక సోషల్ మీడియా ని కుదిపేయడం తమ్ముడు/బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంతు వచ్చింది.