సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో కోర్స్ తో ఉద్యోగం

by | Feb 4, 2025 | ఉద్యోగాలు

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా కోర్స్  మరియు ఉద్యోగ వివరాలు 

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ లో డిగ్రీ విద్యార్హతతో జాయిన్ అయ్యి కోర్స్ పూర్తి చేసిన తరవాత జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్-1 క్రెడిట్ ఆఫీస్ హోదాతో సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో జాయిన్ అవవచ్చు.  మొదటి నెల నుంచి 70 వేల వేతనం అందుకోవచ్చు. 

అన్నట్లు కోర్స్ లో కూడా, మొదటి తొమ్మిది నెలలు, ప్రతి నెలా 2500 చొప్పున చెల్లిస్తారు. ఆ తర్వాత, ఉద్యోగ శిక్షణలో నెలకు 10,000 చొప్పున చెల్లిస్తారు.  అయితే కోర్స్, వసతి, భోజనం, జాబ్ ట్రైనింగ్ అన్ని కలిపి 3 నుంచి 4 లక్షలు చెల్లించాలి (జి ఎస్ టి అదనం). కోర్స్ ఫీజు కోసం సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా వడ్డీతో కూడిన రుణాలు ఇస్తుంది. ఐదేళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగితే మీ కోర్స్ ఫీజు మీకు వాపస్ ఇస్తారు.

ఈ కోర్స్ లో ప్రవేశానికి ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు.  ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్ నెస్ (బ్యాంకింగ్) లకు సంబంధించి ఈ ప్రశ్నలు ఉంటాయి.  అంతే కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్), లెటర్ రైటింగ్, ఎస్సే కు సంబంధించిన పరీక్షా కూడా ఉంటుంది. ఆపై ఇంటర్వ్యూ లు కూడా ఉంటాయి

ఖాళీలు : 1000

జనరల్ : 405 | ఓబీసీ : 270 | ఎస్సి : 150 |  ఎస్టీ : 75 | ఈడబ్ల్యూఎస్ : 100

అర్హతలు : 60% మార్కులతో ఏదేని డిగ్రీ పాస్ అయి ఉండాలి.  అది కూడా నవంబర్ 30, 2024 నాటికి. ఓబీసీ, ఎస్సి, ఎస్టీ , ఈడబ్ల్యూఎస్ లకు 55% మార్కులు కావాలి

వయసు : నవంబర్ 30, 2024 నాటికి 20-30 ఏళ్ళ లోపు ఉండాలి.  రిజర్వేషన్ వర్గాలకు సడలింపులు ఉంటాయి.

పరీక్షా తేదీ : ఇంకా ప్రకటించాల్సి ఉంది

ఫీజు : ఎస్సి, ఎస్టీ , దివ్యంగులకు 150 రూపాయలు. మిగిలిన అందరికి 750 రూపాయలు

దరఖాస్తులకు ఆఖరు తేదీ : ఫిబ్రవరి 20

వెబ్ సైట్ : www.centralbankofindia.co.in