ఢిల్లీ లో చంద్రబాబు ప్రచారం లాభిస్తుందా

by | Feb 4, 2025 | ప్రగడ టీవీ

ఢిల్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపే ఎన్నికలు. ఫిబ్రవరి 8 న కౌంటింగ్.  ఢిల్లీ పీఠం ఎవరిదో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది

అవడానికి ఆప్, కాంగ్రెస్, భాజపా ల మధ్య ముక్కోణపు పోటీ అయినా, ప్రధానంగా ఆప్, భాజపా ల మధ్యే అధికారం కోసం పోటీ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరం గా ఓడిపోయింది. ఈ సారి కొన్ని సీట్లు అయినా గెలవడానికి ప్రయత్నిస్తోంది

ఆప్ 10 ఏళ్లుగా అధికారం లో ఉంది. ఉచిత పథకాలన్నీ సత్ఫలిస్తాలను ఇస్తున్నాయి. అయితే ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలే ఆప్ కు కొంత ప్రతికూలం గా మారాయి .  భాజపా కి వ్యతిరేకంగా ఓటు వేసే వారు, ఆప్ మీద అవినీతి ఆరోపణల నేపథ్యంలో, కాంగ్రెస్ కు వోట్ వేసే అవకాశం ఉంది.

కేంద్రం లో మూడు సార్లు గెలిచినా, 1998 నుండి ఢిల్లీ అధికార పీఠానికి దూరం ఉంటోన్న భాజపా ఈ సారి అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవల బడ్జెట్ లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. ఢిల్లీ లో కనీసం 60% మంది మధ్య తరగతి ప్రజలే. అయితే ఆదాయ పన్ను చట్టం కేంద్ర పరిధిలోనిది. ఆప్ కు వోట్ వేసినా ఆ మినహాయింపులు దేశమంతా వర్తిస్తాయి కాబట్టి ఉచితాలు ఎందుకు వదులుకోవాలి అని ఓటర్ లు అనుకుంటే భాజపా కి షాక్ లేదంటే ఆప్ కు షాక్.

భాజపా మరో ముఖ్య బలహీనత ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం. అంతే కాకుండా పార్టీలో అంతర్గత కలహాలు, కొన్ని ఏరియాల బరిలో సరైన  అభ్యర్థులు లేక పోవడం ఇవన్నీ భాజపా ప్రతికూలాంశాలు

ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో చేసిన ప్రచారం భాజపా కి ఎంత వరకు లభిస్తుంది అనేది వేచి చూడాలి.

కూటమి అభ్యర్థిగా చంద్రబాబు ప్రచారాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు పాజిటివ్ గా  తీసుకుంటారు.  రేపు భాజపా గెలిచినా తర్వాత, హామీలు నెరవేర్చని పక్షంలో, చంద్రబాబు జవాబుదారీతనం తీసుకుంటారా అంటే అది అనుమానమే. ఒకసారి భాజపాకి అధికారం వచ్చాక ఇంక చంద్రబాబు తో పని ఉండదు.  ఇవన్నీ తెలుగు ఓటర్లు ఆలోచిస్తారా అనేది వేచి చూడాలి.

ప్రచారంలో, మోడీ నాయకత్వ లక్షణాలపై చంద్ర బాబు ఎక్కువ దృష్టి సారించారు.  ఢిల్లీలో గత పదేళ్లలో అభివృద్ధి జరగలేదు, వాతావరణ కాలుష్యం తో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉంది అని చెప్పారే తప్ప భాజపా వస్తే ఆప్ కు భిన్నం గా ఏం చేస్తుంది అనే విషయంపై గట్టిగా మాట్లాడలేకపోయారు.

భాజపా , ఆప్ మానిఫెస్టోలలో కొన్ని అంశాలు కామన్ గా ఉన్నాయి.  ప్రత్యేకం భాజపా ను గెలిపించే అంశం ఏది మేనిఫెస్టో లో లేదు. కలుషిత నీరు,  అస్తవ్యస్తమైన రోడ్లు పట్ల ఓటర్లు కొంత ఆప్ పట్ల అసంతృప్తి గా ఉన్నారు.  మరో పక్క అవినీతి అంశం.  ఇన్ని ప్రతికూల అంశాల మధ్య ఆప్ ఉచితాలతో నెట్టుకు రాగలదా  లేదా ఈ అంశాలన్నీ ఓటర్లను భాజపా వైపు మళ్లేలా చేస్తుందా అనేది ఒక నాలుగు రోజులు ఆగాలి.

భాజపా కానీ, ఆప్ కానీ, కాంగ్రెస్ కానీ యమునా నది శుద్ధి చేయడం తప్ప, వాతావరణ కాలుష్యం గురించి ప్రత్యేకం గా ఏమి ప్రకటించలేదు.