సినిమా
మెగాస్టార్ చిరంజీవి పై విశ్వంభర దర్శకుడి పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై విశ్వంభర దర్శకుడి పోస్ట్

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి దర్శకుడు వశిష్ట. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో చిరంజీవి తో నటిస్తోంది.
చాలా రోజుల తర్వాత, చిరంజీవి ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు

పుష్ప-2 50 డేస్ ప్రోమో

పుష్ప-2 50 డేస్ ప్రోమో

పుష్ప-2 50 డేస్ ప్రోమో
అల్లు అర్జున్ కధానాయకుడిగా వచ్చిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ ప్రోమో వదిలారు. బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన పుష్ప-2, దంగల్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి రికార్డు ను కూడా 200 కోట్లమార్జిన్ తో దాటింది

ఫిబ్రవరి సినిమా పండగ

ఫిబ్రవరి సినిమా పండగ

ఫిబ్రవరి సినిమా పండగ
ఫిబ్రవరి పిల్లల పరీక్షల సమయం. పిల్లలందరూ సంక్రాంతి పండగ తర్వాత పూర్తిగా చదువులో నిమగ్నమవుతారు. ఎందుకంటె పెద్ద పరీక్షలు వస్తాయి కాబట్టి.
అయినా సరే, కంటెంట్ మీద నమ్మకంతో ఫిబ్రవరిలో కూడా సినిమాలను విడుదల చేస్తారు. ,గతంలో ఉప్పెన, భీమ్లానాయక్, డి జె టిల్ సినిమాలు ఫిబ్రవరిలో వచ్చి ఘన విజయం సాధించాయి

తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ విడుదల

తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ విడుదల

తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా నుండి ‘హైలెస్సో హైలెస్సా’ లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. తండేల్ ను ప్రప్రాంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పకులు

విక్కీ కౌశల్ చావా ట్రైలర్ విడుదల

విక్కీ కౌశల్ చావా ట్రైలర్ విడుదల

ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చావా చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, శంభాజీ భార్య యేసు భాయ్ పాత్రలో రష్మిక మందాన నటించారు
హిస్టారికల్ డ్రామా గా తెరకెక్కిన చావా చిత్రం ఫిబ్రవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

మహిళా కధాంశంతో అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్

మహిళా కధాంశంతో అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్

మహిళా కధాంశంతో అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్
ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన పరదా చిత్రం టీజర్ ను హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. నటి సంగీత కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు

సెట్ అయిన సీనియర్ హీరోల కాంబినేషన్స్

సెట్ అయిన సీనియర్ హీరోల కాంబినేషన్స్

సెట్ అయిన సీనియర్ హీరోల కాంబినేషన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్. 70 ఏళ్ళ వయసులో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఇప్పటికి కష్టపడుతున్నారు. ఈ నలుగురు హీరోలు ఇప్పటికి పోటీ పడుతుంటారు
అయితే నందమూరి బాల కృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఒక క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు తాజాగా అఖండ-2 పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు మన బోయపాటి శ్రీను

భైరవం టీజర్ విడుదల

భైరవం టీజర్ విడుదల

భైరవం టీజర్ విడుదల
బెల్లం కొండా శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల కలయికలో వస్తోన్న యాక్షన్ డ్రామా ‘భైరవం’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు

సుమ ఇంట్లో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం టీం 

సుమ ఇంట్లో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం టీం 

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనా విజయం సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు కామెడీ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టీం, సుమ కనకాల ఇంట్లో సందడి చేశారు. ఈ ప్రోమో చూడండి. ఫుల్ వీడియో కూడా వస్తోంది

హరి హర వీర మల్లు నుండి ఫస్ట్ సింగల్ విడుదల

హరి హర వీర మల్లు నుండి ఫస్ట్ సింగల్ విడుదల

హరి హర వీర మల్లు నుండి ఫస్ట్ సింగల్ విడుదల
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వస్తోన్న హరి హర వీర మల్లు నుండి మొదటి సింగల్ ‘మాట వినాలి’ విడుదల అయ్యింది.
ఏ ఎం రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకుడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కధానాయిక, బాలీవుడ్ హీరో బాబీ డియోల్ విలన్ గా నటిషున్నాడు. ఈ మధ్య విడుదలైన డాకు మహారాజ్ లో బాబీ డియోల్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు

అజిత్ విదాముయార్చి ట్రైలర్ విడుదల, తెలుగులో పట్టుదల

అజిత్ విదాముయార్చి ట్రైలర్ విడుదల, తెలుగులో పట్టుదల

అజిత్, త్రిష హీరో, హీరోయిన్ లు గా తెరకెక్కిన చిత్రం . ఈచిత్రం లో అర్జున్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకి మగిజ్ తిరుమేని దర్శకత్వ వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

రామ్ చరణ్ సినిమా పై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

రామ్ చరణ్ సినిమా పై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

రామ్ చరణ్ సినిమా పై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా వచ్చిన గేమ్ చేంజర్ ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే సినిమా 100 కోట్ల షేర్ సాధించింది. అంతే కాకుండా, రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇప్పుడు ఫోకస్ అంత రామ్ చరణ్ తరవాత సినిమా మీదే ఉంది.