ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన పరదా చిత్రం టీజర్ ను హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. నటి సంగీత కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు
ఆనంద్ మీడియా వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇన్ ది నేమ్ అఫ్ లవ్’ అనేది ఈ సినిమా టాగ్ లైన్
టీజర్ చివరలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని వినపడుతుంది. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దైవత్వం వికసిస్తుంది. అనేది దాని సారాంశం. దీనిని బట్టి కధ అంత మహిళలకు సంబంధించిన అంశాలపై తిరుగుతుందని కొంత వరకు ఊహించవచ్చు

