విక్కీ కౌశల్ చావా ట్రైలర్ విడుదల

by | Jan 22, 2025 | సినిమా

ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చావా చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.  శంభాజీ మహారాజ్ గా  విక్కీ కౌశల్, శంభాజీ భార్య యేసు భాయ్ పాత్రలో రష్మిక మందాన నటించారు

హిస్టారికల్ డ్రామా గా తెరకెక్కిన చావా చిత్రం ఫిబ్రవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడు

డిసెంబర్ లో విడుదల కావలసిన ఈ చిత్రం, డిసెంబర్ లో పుష్ప విడుదల కావడంతో పోస్ట్ పోన్ చేశారు.