ఫిబ్రవరి పిల్లల పరీక్షల సమయం. పిల్లలందరూ సంక్రాంతి పండగ తర్వాత పూర్తిగా చదువులో నిమగ్నమవుతారు. ఎందుకంటె పెద్ద పరీక్షలు వస్తాయి కాబట్టి.
అయినా సరే, కంటెంట్ మీద నమ్మకంతో ఫిబ్రవరిలో కూడా సినిమాలను విడుదల చేస్తారు. ,గతంలో ఉప్పెన, భీమ్లానాయక్, డి జె టిల్ సినిమాలు ఫిబ్రవరిలో వచ్చి ఘన విజయం సాధించాయి
ఫిబ్రవరిలో మొదటగా అజిత్ నటించిన పట్టుదల సినిమా ఫిబ్రవరి 6 న వస్తోంది. ఆతర్వాత, నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ ఫిబ్రవరి 7 న విడుదలవబోతోంది.
కార్తీకేయ తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా. అంతే కాదు నాచురల్ బ్యూటీ, ఇండియా లో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోయిన్ లలో ఒకరైన సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్. నాగ చైతన్య కు బిగ్గెస్ట్ హిట్ కొట్టడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు
ప్రేమికుల రోజున, అంటే ఫిబ్రవరి 14 న, విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’, రాజా గౌతమ్ ‘బ్రహ్మానందం’ చిత్రాలు విడుదలవుతున్నాయి అంతే కాక సందీప్ కిషన్ నటించిన మజాకా ఫిబ్రవరి 21 న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.
అంతే కాకుండా ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా కూడా ఫిబ్రవరిలో విడుదలవుతోంది. మహా శివరాత్రి కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లు నటించిన భైరవం సినిమా కూడా విడుదల కావచ్చు
అన్ని సినిమాల మీద అంచనాలు బాగా ఉన్నాయి. ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూద్దాం

