‘ఛావా’ వసూళ్ల ప్రభంజనం.. ‘పుష్ప-2’ రికార్డ్స్ బ్రేక్ చేసేలా!
బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.












