ధనుష్, నాగార్జున ‘కుబేర’.. విడుదలకు ముందు భారీ షాక్

by | Feb 23, 2025 | సినిమా

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’.ఈ మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మీక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి , అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్టర్ చేయడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడంతో కుబేరపై అందరిలోనూ ఆసక్తి నేలకొంది.

కాగా, ‘కుబేర మూవీ ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలలో విడుదల కానుండగా ఈ చిత్రానికి కొత్తగా టైటిల్ సమస్యలు వచ్చి పడ్డాయి. కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని, త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూసర్ నరేందర్ తెలిపారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించామని, ఇప్పటికే 85 శాతం వరకు చిత్రీకరణ జరిగిందన్నారు. అదే టైటిల్‌తో శేఖర్ కమ్ముల తన పేరును ట్యాగ్ చేస్తూ ధనుష్, నాగార్జునలతో ‘కుబేర’ సినిమా ప్రకటన చేశారన్నారు. దీనిపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తనకు న్యాయం జరిగేంత వరకూ చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు. మరి ఈ టైటిల్ వివాదం సినిమాను ఎలాంటి మలుపు తిప్పుతుందో అన్నది చూడాల్సి ఉంది. కాగా, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న ఈ ఇత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.