మజాకా’ ట్రైలర్ రిలీజ్.. నవ్వులతో ఇక థియేటర్లు బ్లాస్టే!

by | Feb 23, 2025 | సినిమా

యువ హీరో సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటిస్తున్న  చిత్రం ‘మజాకా’. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. రావు రమేశ్‌, మన్మథుడు ఫేమ్ అన్షు, హైపర్ ఆది, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. శివరాత్రి కానుకగా ఈ ఫిబ్ర‌వ‌రి 26న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. 

ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండ‌గా.. సందీప్‌ కిషన్‌, రావు రమేశ్‌ తండ్రీ కొడుకుల పాత్రల్లో అలరించనున్నారు. కొడుకు ఒక అమ్మాయితో ప్రేమలో ఉండగా.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం అనేది ఆసక్తికరంగా ఉంది. వీరికి జోడీగా రీతూ వర్మ, అన్షు నటించారు. వీరి మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేసారు మేకర్స్. నీలాంటి కొడుకు భూమండలం మొత్తం తిరిగినా దొరకడురా అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా ఆ అమ్మాయిని పడేయాలి అంటే మన్మధుడులా ఉండాలి కానీ మీరు మనవడిని ఎత్తుకునే వాడిలా ఉన్నారు అనే డైలాగ్ నవ్వులు పూయించింది. లియో జేమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. మొత్తంగా  ‘మజాకా’ మూవీ థియేటర్లలో తన తడాఖా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది