‘విశ్వంభర’ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌.. వామ్మో అన్ని కోట్లా?

by | Feb 22, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. శంకర్‌పల్లిలో వేసిన ఓ భారీ సెట్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతుంది. ఈ క్రమంలో ‘విశ్వంభర’ హిందీ డబ్బింగ్‌ హక్కులు భారీ ధరకు అమ్మడయ్యాయట. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ విశ్వంభర సినిమాను రూ.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్త‌రాది ప్రేక్ష‌కులు కూడా మెగాస్టార్ చిత్రాలంటే ఎక్కువ ఇష్ట‌ప‌డుతుంటార‌ని తెలిసిందే. చిరంజీవి నటించిన చాలా చిత్రాలు హిందీలో డబ్ అయి యూట్యూబ్ లో రికార్స్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. దింతో ‘విశ్వంభర’ నార్త్‌లో కూడా భారీ విజ‌యం అందుకోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

కాగా, సోషియో ఫాంటసీ జానర్​లో ‘విశ్వంభర’ మూవీ రూపొందుతుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ నుంచి ఈ జానర్​లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్‌ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే చిరంజీవి, సాయి ధరమ్‌ తేజ్‌, కాంబినేషన్‌లో కొన్ని సీన్స్‌ కూడా షూట్ చేసారని సమాచారం. కాగా, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.