‘బ్రహ్మ ఆనందం’ కోసం మెగా స్టార్ చిరంజీవి

by | Feb 11, 2025 | సినిమా

మెగా స్టార్ చిరంజీవి, లెజెండరీ కమెడియన్ అయిన బ్రహ్మనందం గారి మధ్య మంచి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు, బ్రహ్మనందం, తనయుడు గౌతమ్ తో కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’.  ఈ సినిమా ఫిబ్రవరి 14 న విడుదలవుతోంది.

అయితే బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగబోతోంది.  ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతునున్నారు అని మేకర్స్ ప్రకటించారు.  ఇప్పటికే ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్ ను నిన్న సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు           

ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ ‘బ్రహ్మ ఆనందం’ చిత్రంలో నటుడు వెన్నెల కిశోర్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు