అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేసిన విక్టరీ వెంకటేష్

by | Feb 11, 2025 | సినిమా

ఈ సంక్రాంతి కి వచ్చిన విక్టరీ వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అనిల్ రావిపూడికి, వెంకటేష్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రాంతీయ చిత్రాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది

వెంకటెష్ ఫామిలీ ఆడియన్స్ ఇమేజ్ కు, అనిల్ రావిపూడి మార్క్ ఫామిలీ కామెడీ టైమింగ్ కూడా తోడవడంతో సినిమా భారీ విజయం సాధించింది.

ఇప్పుడు ఈ ‘సంక్రాంతి కి వస్తున్నాం’ సినిమా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా 160 కోట్ల షేర్ రికార్డు ను బ్రేక్ చేసింది.  అల వైకుంఠపురంలో 160 కోట్ల షేర్ మలయాళంతో కలుపుకుని సాధించింది.  కానీ సంక్రాంతికి వస్తున్నాం షేర్ మాత్రం కేవలం తెలుగు లాంగ్వేజ్ కు సంబంధించింది.  సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై నెల రోజులు కావస్తోన్న ఇప్పటికి ఈ సినిమా రోజు కు కోటి రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం.

సీనియర్ హీరోలు ఈ తరం హీరోలతో పోటీపడుతూ రికార్డు లు బ్రేక్ చేయడమంటే మామూలు విషయం కాదు